: బస్సులో రండి... పార్టీ ఇస్తా: బ్యాంకర్లతో మోదీ
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఉన్నతాధికారులు ముంబై నుంచి పూణే వరకు బస్సులో రావాలని, అక్కడ వారిని కలుసుకొని బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించడంతో పాటు మంచి ఆతిథ్యం కూడా ఇస్తానని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే వారంలో 'జ్ఞాన్ సంగమ్' పేరిట పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్ మెంట్ (ఎన్ఐబీఎం)లో మేధోమథన సదస్సు జరగనుంది. దీనికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. బీమా కంపెనీల ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. దేశంలోని టాప్-30 బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ సెప్టెంబర్ 2014 నాటికి రూ.87,368 కోట్లకు చేరడంతో, సాధ్యమైనంత త్వరలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.