: లంక ఎన్నికల్లో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ప్రచారం


శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధ్యక్షుడు మహింద రాజపక్స సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకోసం బాలీవుడ్ స్టార్లను సైతం రంగంలోకి దింపాలని నిర్ణయించారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు మరో ఐదుగురు బాలీవుడ్ నటులు రాజపక్సకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాజపక్స కుమారుడు, ఎంపీ నమల్ ప్రచారం కోసం సల్మాన్ ను ఆహ్వానించినట్టు స్థానిక వెబ్ సైట్ 'ఏషియన్ మిర్రర్' పేర్కొంది. ఈ మేరకు సల్మాన్ ఆదివారం శ్రీలంక చేరుకున్నట్టు తెలుస్తోంది. అటు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వదేశం శ్రీలంకే. ఈ మాజీ 'మిస్ శ్రీలంక' రాజపక్స తనయుడు నమల్ కు స్నేహితురాలు కూడా. లంకలో అధ్యక్ష ఎన్నికలు జనవరి 8న జరగనున్నాయి. షెడ్యూలు కంటే రెండేళ్ల ముందే ఎన్నికలు నిర్వహించాలని రాజపక్స నిర్ణయించారు. సెప్టెంబరులో జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ ప్రజాదరణ 21 శాతానికి పైగా తగ్గిపోవడం ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News