: ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి సాగుతున్న ఎన్ కౌంటర్


నిషేధిత మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ దళాలకు మధ్య నేటి ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా అడవుల్లో 40 మంది మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. మావోలు ఒక మొబైల్ టవర్ ను పేల్చివేసేందుకు వచ్చారని సమాచారం. ఇప్పటివరకూ, గ్రేహౌండ్స్ కమాండోలు 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News