: శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ రోశయ్య


తమిళనాడు గవర్నర్ రోశయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొన్ని రోజుల తరువాత స్వామివారి దర్శనం చాలా సంతోషంగా అనిపించిందని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. తాను, తన భార్య కలసి దర్శించుకున్నామని రోశయ్య చెప్పారు. స్వామివారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

  • Loading...

More Telugu News