: నంది అవార్డుల పేరు మార్చనున్న తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వం తరపున ఇచ్చే సినిమా అవార్డులకు 'నంది' పేరు తొలగించనున్నట్టు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మూడు కొత్త పేర్లను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నంది' పేరిట అవార్డులను కొనసాగిస్తే తమకు సంబంధం లేదని, తెలంగాణ తరపున కళాకారులను ఘనంగా సత్కరిస్తామని తలసాని తెలిపారు.