: బెయిలిచ్చినా లఖ్వీని విడుదల చేయరా?: పాక్ పోలీసులపై ఇస్లామాబాద్ కోర్టు ఆగ్రహం


ముంబై దాడుల కీలక సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ విడుదలపై పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని కోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ లభించిన లఖ్వీని విడుదల చేయడంలో వచ్చిన ఇబ్బందేమిటని పాక్ పోలీసులను ప్రశ్నించింది. బెయిల్ మంజూరైనా లఖ్వీని జైలులో నిర్బంధించడం కుదరదని తేల్చిచెప్పింది. ముంబై దాడి కేసులో జైలులో ఉన్న లఖ్వీకి ఇటీవల పాక్ లోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో లఖ్వీని పాక్ పోలీసులు విడుదల చేయలేదు. దీనిపై స్పందించిన కోర్టు లఖ్వీని విడుదల చేయాల్సిందేనని కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లఖ్వీ నేడు విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ పాక్ లో ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News