: ‘రాజధాని’ అగ్ని ప్రమాద బాధితులకు చంద్రబాబు ఫోన్ లో పరామర్శ
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ లో పరామర్శించారు. ప్రమాదం విషయం తెలియగానే గుంటూరు జిల్లా అధికారులకు ఫోన్ చేసిన ఆయన విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓ వైపు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రమాదం జరిగిన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కూడా ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశంతో అధికారులు బాధితులను ఆయనతో ఫోన్ లో మాట్లాడించారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం లింగాయపాలెంకు చెందిన బాధితుడు మధు అగ్ని ప్రమాదం జరిగిన తీరును చంద్రబాబుకు వివరించాడు. తమ పొలాల్లోని పంటను ఎవరు, ఎందుకు తగులబెట్టారో తెలియడం లేదని చంద్రబాబుతో తన గోడు వెళ్లబోసుకున్నాడు.