: వరంగల్ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్... కొద్దిసేపట్లో ఏరియల్ సర్వే


తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం వరంగల్ చేరుకున్నారు. వరంగల్ జిల్లాలో ఏరియల్ సర్వే నిమిత్తం వచ్చిన ఆయన కలెక్టరేట్ లో జిల్లా అధికార యంత్రాంగంతో భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధిపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. భేటీ ముగియగానే ఆయన జిల్లాలోని సర్కారీ భూములపై ఏరియల్ సర్వే మొదలుపెట్టనున్నారు. అధికారులతో సమీక్షలో భాగంగా జిల్లాకు కేసీఆర్ పలు కొత్త ప్రాజెక్టులు ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ భేటీ వివరాల కోసం వరంగల్ జిల్లా ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News