: మనుషులను గుర్తిస్తున్న మైఖేల్ షూమాకర్
మంచులో స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి పోయిన ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షూమాకర్ సరిగ్గా సంవత్సరం తరువాత కాస్తంత కోలుకున్నారు. షూమాకర్ ఇప్పుడు బంధువులను గుర్తిస్తున్నాడని, అయితే ఇంకా మాట్లాడటం లేదని ఆయన మిత్రుడు ఫిలిప్పీ స్టిరిఫ్ తెలిపారు. మైఖేల్ షూమాకర్ భార్య కోరీన్, ఆయనకు చికిత్స చేస్తున్న నరాల నిపుణుడు ఈ విషయాన్ని ద్రువీకరించినట్టు తెలిపారు. కాగా, ఆయన పూర్తిగా కోలుకునేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని షూమాకర్ మేనేజర్ వివరించారు. షూమాకర్ కు గత సంవత్సరం డిసెంబర్ 29న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.