: ‘రాజధాని’ అగ్ని ప్రమాదం వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కానున్న రెండు మండలాల్లో గడచిన రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి కారణమైన నిందితులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ లు రంగంలోకి దిగాయి. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నిందితులను ఎంతమాత్రం ఉపేక్షించరాదని కఠిన ఆదేశాలు జారీ చేయడంతో గుంటూరు జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలాన్ని జిల్లా కలెెక్టర్, అర్బన్ ఎస్పీలు సందర్శించారు. అంతకుముందే జిల్లా బాసుల నుంచి ఆదేశాలందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుతెన్నులపై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అక్కడ వారికి ఎలాంటి క్లూ లభించలేదట. దీంతో డాగ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దించారు. మరి డాగ్ స్క్వాడ్ లైనా నిందితులను గుర్తిస్తాయో, లేక చంద్రబాబు చేత అధికారులకు మొట్టికాయలు వేయిస్తాయో చూడాలి.