: హైదరాబాద్ టీసీఎస్ లో 2 వేల మందికి ఉద్వాసన


ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థల్లో పని చేస్తున్న 30 వేల మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 2 వేల మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఐటీ నిపుణులను షాక్ కు గురి చేస్తోంది. ఉద్యోగుల ఉద్వాసన పారదర్శకంగా లేదని... అన్యాయంగా తీసివేస్తున్నారని సంస్థలో పనిచేస్తున్న కొందరు వాపోతున్నారు. ట్రైనీ, జూనియర్ ఉద్యోగులతో తక్కువ వేతనంతో పనిచేయించుకోవచ్చనే ఆలోచనతో... సీనియర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News