: అతడికి ఆకాశమే హద్దు: గవాస్కర్


ఆసీస్ తో టెస్టు సిరీస్ ద్వారా ఫామ్ అందిపుచ్చుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి ఆకాశమే హద్దు అని పేర్కొన్నాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్సులో చేసిన సెంచరీతో కలిపి ఈ సిరీస్ లో కోహ్లీ మూడు శతకాలు నమోదు చేశాడు. దీనిపై గవాస్కర్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ, తర్వాతి శకం అతనిదేనని అభిప్రాయపడ్డాడు. 26 ఏళ్ల వయసుకే వన్డేల్లో 21 సెంచరీలు, టెస్టుల్లో 9 సెంచరీలు నమోదు చేశాడని వివరించాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతనికి ఆకాశమే హద్దు అనక తప్పదని స్పష్టం చేశాడు. కాలానుగుణంగా కోహ్లీలో మార్పు కనిపిస్తోందని, సెంచరీ చేసిన వెంటనే బ్యాట్ పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం అతని పరిణతికి నిదర్శనమని అన్నాడు. మరింత సంయమనం పాటించడం అలవర్చుకుంటే, కోహ్లీ డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించగలడని, అది భారత్ కు లాభిస్తుందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News