: నిర్మాణం కోసం తవ్వితే... పుర్రెలు బయటపడ్డాయి
స్కూల్ ఆవరణలో నిర్మాణాల కోసం తవ్వకాలు చేపడితే... ఏకంగా ఎనిమిది మానవ పుర్రెలు బయటపడ్డాయి. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన, మణిపూర్ లోని ఇంఫాల్ లో ఓ పాడుబడిన స్కూల్ ఆవరణలో చోటు చేసుకుంది. చొరబాటుదారులను అణచివేసేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలు 1980 నుంచి 1999 వరకు ఇంపాల్ లోని ఈ స్కూల్ లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమయంలో, పారామిలిటరీ బలగాలు అరెస్ట్ చేసిన కొంతమంది, అదృశ్యమయ్యారంటూ అప్పట్లో ఆందోళనలు కూడా జరిగాయి. తాజా తవ్వకాల్లో పుర్రెలు బయటపడంతో, సామాజిక సంస్థలు ఆందోళన వెలిబుచ్చాయి. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ కు విన్నవించాయి.