: ఒబామాను కోతి అన్నందుకు ఉత్తర కొరియా ఇంటర్నెట్ బంద్


ఉత్తర కొరియా అధ్యక్షుడిని హతమార్చే కల్పిత కుట్ర కథతో సోని సంస్థ నిర్మించిన కామెడి సినిమా 'ది ఇంటర్వ్యూ'పై నెలకొన్న వివాదం మరింతగా ముదిరింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతితో పోల్చినందుకు ఉత్తర కొరియాలో రెండు గంటలపాటు ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. సినిమా విడుదలకు అమెరికా ప్రయత్నిస్తే, చావుదెబ్బ తీస్తామని ఉత్తర కొరియాకు చెందిన నేషనల్ డిఫెన్స్ కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో, అందుకు ప్రతీకారంగానే కొరియాలో నెట్ సేవలను అమెరికా ఆపివేయించిందని భావిస్తున్నారు. ప్యాంగ్యాంగ్ కాలమానం ప్రకారం ఉదయం 7.30 నుంచి 9:30 గంగల వరకు ఉత్తర కొరియాలోని ఇంటర్నెట్, 3జీ నెట్‌వర్క్ స్తంభించిపోయాయి. అమెరికా తీరుకు కొరియన్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • Loading...

More Telugu News