: క్రికెట్ ప్రపంచకప్-2015లో పాకిస్తాన్ తో భారత్ తొలి మ్యాచ్
వచ్చే సంవత్సరం జరిగే క్రికెట్ ప్రపంచకప్-2015లో ఇండియా తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది. నెల రోజులకుపైగా జరిగే ఈ క్రికెట్ పోటీలను ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రారంభమయ్యే టోర్నీలో తొలి మ్యాచ్ క్రైస్ట్ చర్చ్ లో ఆతిథ్య కివీస్, శ్రీలంక దేశాల మధ్య జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం పూల్ 'బి'లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్థాన్, భారత్‌లు తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థితో తలపడటంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితమే. ఈ టోర్నీలో తలపడే 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఫైనల్‌తో కలిపి మొత్తం 49 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీ 44 రోజులు సాగుతుంది. పూల్ 'ఎ'లో న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పూల్ 'బి'లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ పది టెస్టు జట్లతో పాటు నాలుగు క్వాలిఫైయింగ్ జట్లు కూడా టోర్నీలో పోటీపడతాయి.