: ‘రాజధాని’ అగ్ని ప్రమాదాలపై చంద్రబాబు సీరియస్... నివేదిక పంపాలని కలెక్టర్ కు ఆదేశం


నవ్యాంధ్ర రాజధాని రూపుదిద్దుకోనున్న రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో గడచిన రాత్రి ఒకే తరహాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాలు, తుళ్లూరు మండలం మందడం, లింగాయపాలెంలలో గుర్తు తెలియని దుండగులు గడ్డివాములతో పాటు అరటి తోటలకు కూడా నిప్పు పెట్టారు. ఒకే రోజు, ఒకే తరహాలో జరిగిన అగ్ని ప్రమాదాలపై అక్కడి రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాలపై సమాచారం అందుకున్న సీఎం గుంటూరు జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News