: నేడు వరంగల్ జిల్లా ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ తన జిల్లాల పర్యటనల్లో భాగంగా నేడు వరంగల్ జిల్లాకు వెళుతున్నారు. వరంగల్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్న కేసీఆర్, ఆ తర్వాత వరంగల్ లో అధికార యంత్రాంగంతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ భూములపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News