: కోస్తాంధ్రకు వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతో, ఈ నెల 31 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది.