: భారత్ లో రూ.214 కోట్లు కొల్లగొట్టిన 'పీకే'
అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా భారత్ లో ఇప్పటివరకు రూ.214 కోట్లు వసూలు చేసిందట. అమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'పీకే' తొలిరోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా, ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లు ఇంకా వెల్లడి కాలేదు. ఆ వివరాలు కూడా తెలిస్తే బాక్సాఫీసు రికార్డు విషయంపై స్పష్టత వస్తుంది.