: 'లింక్డ్ ఇన్' లో పాదం మోపిన మోదీ


సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ దిట్ట. ఎన్నికలైనా, ప్రభుత్వ పథకాల ప్రచారమైనా సామాజిక అనుసంధాన సైట్లను సాధ్యమైనంత మేర ఉపయోగించుకుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సైట్లలో మోదీకి విశేషమైన పాప్యులారిటీ ఉంది. ట్విట్టర్లో ఒబామా తర్వాత అత్యధిక ప్రజాదరణ పొందిన రాజకీయనేత మోదీనే. ఇప్పుడాయన మరో ప్రఖ్యాత అనుసంధాన వేదిక 'లింక్డ్ ఇన్' లోనూ అడుగుపెట్టారు. 'లింక్డ్ ఇన్' లో మోదీ ప్రవేశం వాణిజ్య వర్గాలు, కార్పొరేట్ ప్రముఖులపై గణనీయ ప్రభావం చూపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మోదీ అప్పుడే మూడు లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News