: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవానికి రాహుల్ గైర్హాజరు


కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నేడు ఢిల్లీలో నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీనిపై పార్టీ వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా, అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, షీలా దీక్షిత్ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News