: టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన
హైదరాబాదులో టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మార్పీఎస్ ఆందోళనకు దిగింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ఎదుట ఆందోళనకు యత్నించారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు వరకు టీడీపీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన ఎమ్మార్పీఎస్, కొంతకాలంగా వ్యతిరేక ధోరణి కనబరుస్తోంది. వైసీపీని వీడి జూపూడి ప్రభాకరరావు టీడీపీలో చేరడమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.