: మీడియాపై సచిన్ మండిపాటు


తాను ఢిల్లీలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు, దాని కోసం ఐఐటీ ఢిల్లీకి చెందిన స్థలాన్ని కోరినట్టు వచ్చిన వార్తలపై క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. తాను ఎవరి నుంచి స్థలం కోరలేదని ట్విట్టర్లో స్పష్టం చేశాడు. క్రికెట్ అకాడమీ కోసం స్థలం ఇవ్వాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ ఒత్తిడి చేసిందని ఐఐటీ ఢిల్లీ డైరక్టర్ రఘునాథ్ షెవగోంకర్ ఆరోపించినట్లు మీడియా పేర్కొనడంపై సచిన్ మండిపడ్డాడు. ఇలాంటి వార్తలు ప్రచురించేటప్పుడు నిశిత పరిశీలన అవసరమని, ముందుగా నిర్ధారించుకోవాలని మీడియాకు చురక అంటించాడు. సదరు ఆరోపణలు నిజమని భావిస్తే తన వివరణ అడిగి ఉండాల్సిందని, అలా ఎందుకు అడగలేదని ప్రశ్నించాడు. తాను ప్రస్తుతం ఏ విధమైన అకాడమీ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News