: ఎయిర్ ఏషియా విమానంలో భారతీయులెవరూ లేరు!


ఈ ఉదయం నుంచి కనిపించకుండా పోయిన ఎయిర్ ఏషియా విమానంలో భారతీయులెవరూ లేరని తెలుస్తోంది. ఇండోనేసియా నగరం సురబయ నుంచి సింగపూర్ వెళుతున్న ఈ విమానం (క్యూజెడ్ 8501) టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కంట్రోల్ సెంటర్ తో సంబంధాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ఎయిర్ బస్ లో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్టు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ విమానం కోసం జావా సముద్రంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News