: దేవినేని ఉమ పర్యటనలో ఉద్రిక్తత... వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట
ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకాశం జిల్లాలో జరుపుతున్న పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్ కాలువలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు మంత్రి ఉమ నేడు ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, సురేష్ మంత్రిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. అయితే, వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.