: ఎర్రచందనం మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఫైల్స్ రాజా అరెస్ట్
ఎర్రచందనం అక్రమ రవాణాలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ చంద్రశేఖరనాయుడు అలియాస్ ఫైల్స్ రాజా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లాలోని తంబురతీర్థం పరిసర ప్రాంతాల్లో అతడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైల్స్ రాజాతో పాటు మరో తొమ్మిది మంది స్మగ్లర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు మస్కా కొట్టి తిరుగుతున్న మరో స్మగ్లర్ గంగిరెడ్డితోనూ ఫైల్స్ రాజాకు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే దుబాయి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ సాహుల్ అమీద్ కు 500 టన్నుల ఎర్రచందనాన్ని ఎగుమతి చేసినట్లు ఫైల్స్ రాజా పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.