: జావా సముద్రంలో ఎయిర్ ఏసియా విమాన శకలాలు...ప్రతికూల పరిస్థితులే ప్రమాదానికి కారణం?


162 మందితో ఇండోనేసియా నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏసియా విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. జావా సముద్రంలో విమాన శకలాలు లభించిట్లు అక్కడి మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రమాదాన్ని ఎయిర్ ఏసియా ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో విమానాన్ని మరింత పైకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని పైలట్ ఏటీసీ అధికారులను కోరినట్లు సమాచారం. అయితే ఏటీసీతో పైలట్ మాట్లాడుతుంగానే విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News