: సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన ఆటో... ఐదుగురు గొర్రెల కాపరుల గల్లంతు
నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి నేటి ఉదయం ఓ ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో వెళుతున్న ఐదుగురు గొర్రెల కాపర్లు సాగర్ నీటిలో గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా బాధితుల ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని పోలీసులు చెప్పారు.