: ఢిల్లీని చుట్టుముట్టిన పొగమంచు...ప్రధాని జార్ఖండ్ పర్యటన రద్దు!


చలి పులి తన ప్రతాపాన్ని ఏమాత్రం సడలించలేదు. దేశం మొత్తం చలి గుప్పట్లో చిక్కుకుంది. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు ఆవరించింది. నగరంలో నేటి ఉదయం 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో పలు విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీని చుట్టుముట్టిన పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన అర్ధాంతరంగా రద్దైంది. నేటి ఉదయం జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకావాల్సి ఉంది. అయితే పొగమంచు కారణంగా ప్రధాని పర్యటన రద్దైనట్లు అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News