: విజయవాడలో లలిత కళా అకాడమీ...దుర్గమ్మ సేవలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి
విజయవాడలో లలిత కళా అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సమాచార, పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయానికి వచ్చిన ఆయన దుర్గామాతను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.