: సెంచరీలతో చెలరేగిన రెహానే, కోహ్లీ!


మూడో టెస్టులో అజింక్యా రెహానే, విరాట్ కోహ్లీలు సెంచరీలు పూర్తి చేశారు. 127 బంతుల్లో సెంచరీ చేసిన రెహానే, టెస్టుల్లో తన మూడో శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత 166 బంతుల్లో కోహ్లీ తన తొమ్మిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో టెస్టులో ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను కోహ్లీ, రెహానే జంట ఆదుకుంది. ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న వీరిద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగారు. దీంతో 95 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 336 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ (104), రెహానే (111) భారత్ ను భారీ స్కోరు దిశగా తీసుకెళుతున్నారు.

  • Loading...

More Telugu News