: ఎయిర్ ఏసియా విమానం అదృశ్యం...విమానంలో 162 మంది ప్రయాణికులు


ఇండోనేసియా నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏసియా విమానం అదృశ్యమైంది. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో కలిపి మొత్తం 162 మందితో బయలుదేరిన క్యూజెడ్ 8501 విమానానికి కొద్దిసేపటి క్రితం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తో సంబంధాలు తెగిపోయాయి. నేటి ఉదయం 7.20 గంటల నుంచి ఏటీసీతో సదరు విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఎయిర్ ఎసియా ప్రకటించింది. విమానం అదృశ్యం నేపథ్యంలో అటు సింగపూర్ తో పాటు ఇటు ఇండోనేసియాలోనూ ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News