: విశాఖ అచ్యుతాపురం సెజ్ లో పేలుడు...ఒకరు మృతి, పది మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం సంభవించింది. సెజ్ లోని ఆంజనేయ కంపెనీలో బాయిలర్ పేలింది. దీంతో ఓ కార్మికుడు చనిపోగా, మరో పది మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కంపెనీ యాజమాన్యం హుటాహుటిన గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో గాయపడ్డ కార్మికుల కుటుంబ సభ్యులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు.