: నేడు జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం... హాజరుకానున్న ప్రధాని మోదీ!


జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ నేడు పదవీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని మొరాబది మైదాన్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అహ్మద్, దాస్ చేత ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి జేపీ నద్దా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో సుదీర్ఘంగా చర్చించిన బీజేపీ, రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎంగా రఘువర్ దాస్ ను ఎంపిక చేసింది. జంషెడ్ పూర్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

  • Loading...

More Telugu News