: షెడ్యూల్డు తెగల యువతుల పెళ్లికి 50 వేలు అందజేస్తాం: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల


షెడ్యూల్డు తెగలకు చెందిన యువతుల వివాహానికి 50 వేల రూపాయల బహుమతి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటే వారికి అవసరమైన సాయం ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అలాగే, ఎస్టీ దంపతులకు పుట్టిన శిశువులకు అవసరమైన సరకులతో ప్రత్యేక కిట్ అందజేయనున్నామని ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ఏం చేయాలన్న అంశంపై మంత్రులు చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం ఆరు కొత్త పథకాలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన చెప్పారు. అలాగే, నిధుల మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కూడా సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News