: సమ్మె విరమించిన ఏపీ విద్యుత్ ఒప్పంద కార్మికులు
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విద్యుత్ ఒప్పంద కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి విధుల్లో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. కాగా, ఏపీ శీతాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ విద్యుత్ ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సభను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.