: మరో దర్శకుడ్ని ఆకాశానికెత్తిన రాంగోపాల్ వర్మ


సంచలన వ్యాఖ్యలతో ఎవరినైనా విమర్శించడానికి వెనుకాడని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ దర్శకుడ్ని ఆకాశానికెత్తేశాడు. శంకర్ 'ఐ' రెండో ట్రైలర్ చూసిన తరువాత తన ఆలోచనల్లో తేడా వచ్చిందని ట్వీట్ చేశాడు. తన దృష్టిలో తమిళనాడులో రజనీకాంత్, జయలలిత కంటే కూడా శంకరే గొప్పవాడని పేర్కొన్నాడు. శంకర్ 'ఐ' ట్రైలర్ చూస్తే కొత్త శక్తి వస్తుందని తెలిపాడు. 'ఐ' సినిమా మొదటి రోజు కలెక్షన్లు 'లింగా' కలెక్షన్లను మించిపోతాయని వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తాను రజనీకాంత్ కి వీరాభిమానినని పేర్కొన్న వర్మ, ఇక నుంచి తాను శంకర్ కు అభిమానినని పేర్కొన్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో శంకర్ సినిమా తీస్తే అది ఇండియా 'అవతార్'లా ఉంటుందని ఆకాశానికెత్తాడు.

  • Loading...

More Telugu News