: పట్టాలు మరమ్మతు చేస్తుండగా దూసుకొచ్చిన రైలు... ఐదుగురు మృతి
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు ఐదుగురు రైల్వే ఉద్యోగులను బలి తీసుకుంది. బీహార్‌లోని ససారం జిల్లా కామౌహు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు మరమ్మతు చేస్తున్న సీనియర్ సెక్షన్ ఇంజనీరు నాథూ ప్రసాద్, మరో నలుగురు కూలీలపైకి అజ్మీర్-సీల్దాహ్ ఎక్స్ ప్రెస్ రైలు దూసుకొచ్చింది. దట్టమైన పొగమంచు కారణంగా వారు కనీసం పక్కకు తప్పుకునే సమయం కూడా లేకపోయింది. రైలు హారన్ ఇవ్వకపోవడంతో ఎదురుగా వస్తున్న రైలును వారు గుర్తించలేక, ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు.