: నా జీవితంలో పెద్ద తప్పు అదే: సునీల్ గవాస్కర్


అప్పట్లో మెల్బోర్న్ టెస్టు మ్యాచ్ నుంచి తాను ఆట మధ్యలో వెనక్కు రావడం పెద్ద తప్పని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. 1981లో జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వివాదాన్ని సునీల్ గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ వేసిన ఇన్-కట్టర్ కు గవాస్కర్ ఎల్బీగా అవుట్ అయినట్టు అంపైర్ రెక్స్ వైట్ హెడ్ ప్రకటించాడు. బంతి తన బ్యాట్ కు తాకిందని గవాస్కర్ వాదించినా ప్రయోజనం లేకపోయింది. పెవిలియన్ కు వెళుతున్న గవాస్కర్ ను ఉద్దేశించి లిల్లీ ఏదో అన్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన గవాస్కర్ పిచ్ పైకి వచ్చి మరో ఎండ్ లో ఉన్న చేతన్ చౌహాన్ సహా మైదానం వీడి వెళ్ళాడు. ఆపై జట్టు మేనేజర్ కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందినట్టు మూడు దశాబ్దాల తరువాత గవాస్కర్ తెలిపాడు. భారత కెప్టెన్ గా తను అలా చేయకుండా ఉండాల్సిందని అన్నాడు.

  • Loading...

More Telugu News