: 20 ఏళ్ల తరువాత 'ఒక రూపాయి' నోట్ల ముద్రణ
సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆపివేసిన ఒక రూపాయి నోట్ల ముద్రణను తిరిగి ప్రారంభించాలని రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ దఫా ముద్రించే నోట్లు ఒక వైపు పింక్, మరోవైపు గ్రీన్ షేడ్స్ రంగుల్లో ఉంటాయి. సాధారణంగా అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ, ఈ ఒక రూపాయి నోట్లను కేంద్ర ప్రభుత్వం స్వయంగా ముద్రిస్తుంది. దీంతో, దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ నోట్లపై రూపాయి గుర్తు ఉంటుందని, పాత నోట్లపై ఉన్నట్టుగానే సాగర్ సామ్రాట్ (సముద్రంలోని ఓ చమురు క్షేత్రం) చిత్రం, 15 భారత భాషల్లో నోటు విలువ తదితరాలు ఉంటాయని తెలుస్తోంది.