: గడ్డకట్టిన దాల్ సరస్సు
సుప్రసిద్ధ పర్యాటక స్థలం దాల్ సరస్సు పాక్షికంగా ఘనీభవించింది. జమ్మూకాశ్మీర్ లోని ఇతర జలాశయాలు కూడా గడ్డకట్టాయి. ఉష్ణోగ్రత మైనస్ 5.6 డిగ్రీలకు పడిపోవడంతో నీళ్లు గడ్డకట్టాయి. శ్రీనగర్ లో ఉన్న దాల్ సరస్సు ఈ ఉదయం కొద్దిమేర ఘనీభవించిన స్థితిలో దర్శనమిచ్చింది. యాత్రికులను సరస్సులో షికారుకు తీసుకెళ్లే పడవలు నిలిచిపోయాయి. పడవలు నడిపే వ్యక్తులు తెడ్లతో మంచు దిబ్బలను పగులగొట్టడం కనిపించింది. తాజా పరిస్థితి స్థానికులకు ఇబ్బందులు కలిగించగా, యాత్రికులు మాత్రం బాగా ఆస్వాదించారట. దాల్ సరస్సును గడ్డకట్టిన స్థితిలో చూడడం తమ అదృష్టమని ఓ గుజరాతీ జంట పేర్కొంది.