: చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఈ సోదాల్లో 22 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక ఎనిమిది వాహనాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ప్రస్తుతం అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతకాలం నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న సంగతి తెలిసిందే.