: సమస్యలుంటే అధిష్ఠానంతో చెప్పుకోవాలి...మీడియాకెక్కుతారా?: బాబు సీరియస్
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు అధికార టీడీపీలో టీకప్పులో తుపాను రేపాయి. ఎంపీ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు, సహచర నేత మంత్రి దేవినేని ఉమ, ఇతర నేతల మధ్య సమన్వయం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎం ఎంపీ నానిని ఆదేశించినట్టు సమాచారం. నేతల మధ్య ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిపై అంతర్గతంగా చర్చించుకోవాలే కానీ, వాటిని బహిరంగంగా ప్రస్తావించడం సరికాదని బాబు పేర్కొన్నారు. ప్రభుత్వాధికారుల తీరుపై నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఆయన ఘాటైన విమర్శలు చేశారు.