: టెస్టును టీట్వంటీలా ఆడేసిన మెక్ కల్లమ్
న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ టెస్టు మ్యాచ్ ను టీట్వంటీగా మార్చేశాడు. శ్రీలంకతో న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. కేవలం 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు చేసిన బ్రెండన్ మెక్ కల్లం మరో ఐదు పరుగులు చేసి ఉంటే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర పుటలకెక్కి ఉండేవాడు. డబుల్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో మెక్ కల్లమ్ అవుటయ్యాడు. విలియమ్సన్ (54), నీషమ్ (85) అతనికి చక్కని సహకారమందించారు. మాధ్యూస్ రెండు వికెట్లతో రాణించాడు.