: అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు: కేథరీన్ థ్రెసా
కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ హీరోయిన్ కేథరీన్ థ్రెసా ధన్యవాదాలు తెలిపింది. తన సోదరుడు క్రిస్టోఫర్ ఆత్మహత్యకు పాల్పడడంతో వేదనలో ఉన్న తనకు అందరూ ఎంతో ప్రేమను పంచారని పేర్కొంటూ ఫేస్ బుక్ లో సందేశం పోస్టు చేసింది. కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన తన తమ్ముడు గత రెండేళ్లుగా తల్లిదండ్రుల మాటలు వినడం మానేశాడని, చదువంటే కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అయితే టీనేజ్ లో ఇవన్నీ సహజమని పేర్కొంటూ అంతా అతడికి స్వేచ్ఛ నిచ్చామని తెలిపింది. కొన్నాళ్ల తరువాత ఆధ్యాత్మికత వైపు మరలిన తన తమ్ముడు, అంతా బాగుందని భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేథరీన్ తెలిపింది. క్రిస్టోఫర్ లేడన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నానని ఆమె వెల్లడించింది.