: పెషావర్ మారణకాండ సూత్రధారి హతం


పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిపిన దారుణ మారణకాండకు పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆర్మీ స్కూలుపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడాలంటూ స్కెచ్ గీసిన తీవ్రవాది సద్దాంను పాక్ సైన్యం మట్టుబెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాక్కున్న ఉగ్రవాది సద్దాంను పాక్ సైన్యం వెంటాడి వేటాడింది. ఉగ్రవాదులను ఏరివేస్తామని, ప్రకటించిన పాక్ సైన్యం ప్రణాళిక ప్రకారం వారిపై వేటకు వెళ్తోంది. ఎక్కడో ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదులపై విరుచుకుపడుతున్న పాక్ కు హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాద అగ్రనేత ఇస్లామాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నా కనిపించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News