: మరోసారి యాజమాన్యం, కార్మికుల వివాదం... గరివిడి ఫేకర్ వద్ద ఉద్రిక్తత


విజయనగరం జిల్లా గరివిడి ఫేకర్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా నడిచిన గరివిడి ఫేకర్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు పది నెలల క్రితం అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ పరిశ్రమ యాజమాన్యంతో కలిసి ప్రకటించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో యాజమాన్యం చెప్పిన ప్రకారం ఉద్యోగులు వీఆర్ కు అంగీకరించారు. దీంతో తృణమో, పణమో ఇచ్చి ఉద్యోగులతో బంధం తెంచేసుకుంది గరివిడి ఫేకర్ యాజమాన్యం. ఉద్యోగుల బకాయిలు చెల్లిపోగానే పదినెలల విరామంతో పరిశ్రమను తిరిగి తెరచింది. దీంతో ఉద్యోగులుగా పని చేసిన కార్మికులు మరోసారి యాజమాన్యం వద్దకు వెళ్లారు. ఉద్యోగులుగా ఎవరినీ నియమించడం లేదని, అందర్నీ ఒప్పంద కార్మికులుగా తీసుకుంటున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News