: ఆయనతో భేటీలో ఎలాంటి ప్రాధాన్యతా లేదు: అయ్యన్నపాత్రుడు


మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీలో ఎలాంటి ప్రాధాన్యతా లేదని మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. హైదరాబాదులో మంత్రి గంటాతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ టీడీపీలో గంటా వర్గం, అయ్యన్న వర్గం అంటూ ఏదీ లేదని అన్నారు. ఎవరైనా పార్టీకోసం పని చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. కొంత మంది అధికారులు కాంగ్రెస్ హయాంలో పని చేసినట్టు చేస్తున్నారని, పని చేయని అధికారులతో కూడా ఎలా పని చేయించుకోవాలో తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు. కాగా, కొణతాల టీడీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News