: ఆకతాయిలకు క్లాస్ పీకిన రిచా చద్దా


వెండి తెరపై విభిన్న పాత్రలను పోషించిన బాలీవుడ్ నటి రిచా చద్దా తనను ఎగతాళి చేస్తున్న ఆకతాయిలకు క్లాస్ పీకింది. ఢిల్లీలో స్నేహితులతో కలిసి రిచా చద్దా పార్టీ చేసుకుంటోంది. ఇంతలో ఓ ఇద్దరు ఆకతాయిలు ఆమె వెంటపడ్డారు. చద్దా ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్లారు. ఆమె వస్త్రధారణ, సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలపై కామెంట్లు చేశారు. ఇంతలో వారిలో ఒకడు ఆమె ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించింది. పబ్లిక్ పర్సనాలిటీ, పబ్లిక్ ప్రాపర్టీ మధ్య తేడా తెలుసుకోవాలని వారికి క్లాస్ పీకింది. దురుసు ప్రవర్తనను ఎవరూ సహించకూడదని, హద్దు మీరినప్పుడు ఎవరూ సహించకూడదని ఆమె సూచించింది. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆమెకు సర్ది చెప్పడంతో ఆమె శాంతించింది. కాగా, 'రిచా చద్దా రామ్ లీలా', 'ఫుక్రే', 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' వంటి సినిమాల్లో నటించింది.

  • Loading...

More Telugu News