: ఎమ్మెల్యే గోరంట్ల కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న శివ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వంతెన వద్ద శివ మృతదేహం లభ్యమైంది. గత రాత్రి కొందరు యువకులతో శివ ఘర్షణ పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శివ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.